TG-4929
Telugu

చాలును లోక భోగములు చాలును

Chaalunu Looka Bhoogamulu Chaalunu

0
views
పల్లవి

చాలును లోక భోగములు చాలును చాలును మీనమును బట్టు గాలమైయున్న భోగములు ||చాలును||

1వ చరణం

1.  ఎండమావులే నీరనుచు మెండుగఁ బరుగిడు జింక కుప మండనై బలహీను నైతిఁ ||చాలును||

2వ చరణం

2.  బూరుగ పండారగింపఁ గోరి కాచికొని యున్నట్టి కీరసామ్య మైతి నయ్యో ||చాలును||

3వ చరణం

3.  దీపపు దీప్తి నాశించి యూపిరి విడు పురుగు రీతిఁ బాపపు భ్రమచే నట్లయితిఁ ||చాలును||

4వ చరణం

4.  పూలతో ఁటయందుఁ బెరుగు బూరుగ వృక్షంబునై నే మేలునకు మూలముగాన నైతిఁ ||చాలును||

5వ చరణం

5.  చల్లిన వితనము ల్జంపు చౌట భూమి వలె నేఁ గాఁగ సత్యము నిష్ఫలమయ్యొ నకట ||చాలును||

6వ చరణం

6.  మాయ సంత నైతి యేసు నాయక నన్విడక మార్పు జేయుమి నెన రుంచి నాపైఁ ||చాలును||

7వ చరణం

7.  తొల్లి నన్ రప్పించినట్టి చల్లని సువార్త తేజ ముల్లమందు నుండఁ జేయ ||చాలును||

8వ చరణం

8.  మంచు పోల్కె ననుఁ జేయుటకై ముంచుమీ నీ రక్తాంబుధిలోఁ బెంచుమి నీ వాక్సారము చేఁ ||చాలును||

9వ చరణం

9.  చెడ్డ బిడ్డ నయ్య నేను దొడ్డ రక్షకుండ వీవు అడ్డులేక నన్నుఁ బ్రోవు ||చాలును||