TG-4923
Telugu

చాటుఁడి శుభవార్తను బోధకులారా చాటుఁడి

Chaatundi Shubhavaarthanu Boodhakulaaraa Chaatundi

0
views
పల్లవి

చాటుఁడి శుభవార్తను బోధకులారా చాటుఁడి శుభవార్తను జాటుఁ డి శుభవార్త సకల రాష్ట్రములలోఁ జాటించుఃడని చెప్పె ఢాటిగఁ ప్రభు యేసు ||చాటుఁడి||

1వ చరణం

1.  లోకమును ప్రేమించి లోకరక్షణ కొఱకు ప్రాకటంబుగ సుతునిఁ బంపె దేవుఁడటంచుఁ ||చాటుఁడి||

2వ చరణం

2.  శత్రువుల రక్షింప మిత్రుఁడుగా వచ్చి మైత్రి నసుపు నిచ్చి మరల లేచెన టంచుఁ ||చాటుఁడి||

3వ చరణం

3.  ఎట్టి పాపు లైనఁ బట్టి యేసుని మాట దిట్టముగ నమ్మినఁ బట్టుగ క్షమియించుఁ ||చాటుఁడి||

4వ చరణం

4.  హృదయ శుద్ధిని గోరి సదయుఁడగు రక్షకునిఁ పదిలముగఁ ప్రార్ధింపఁ పరిశుద్ధాత్మ నొసంగుఁ ||చాటుఁడి||

5వ చరణం

5.  నమ్మి బాప్తిస్మంబు నెమ్మిఁ బొందిన మనుజు లిమ్ముగఁ బొందుదు రిలను ఘన రక్షణముఁ ||చాటుఁడి||

6వ చరణం

6.  ఇందు నందు మికుఁ బొందుగ నొసఁగును సందియము లేకుండ సకల భాగ్యము లనుచుఁ ||చాటుఁడి||