TG-4943
Telugu

చిన్నారి బాలగా చిరుదివ్య జ్యోతిగా

Chinnaari Baalagaa Chirudivya Jyoothigaa

0
views
పల్లవి

చిన్నారి బాలగా చిరుదివ్య జ్యోతిగా కనరాని దేవుడు కనిపించెనా తన ప్రేమ నా పైన కురిపించెనా… కురిపించెనా జో.. లాలిజో.. జో… లాలిజో… పరలోక భోగాలు వర దూత గానాలు తనకున్న భాగ్యాలు విడనాడెనా (2) పాపాలు భరియించెనా – శాపాలు భరియించెనా ఆనందమే ఆశ్చర్యమే సంతోషమే సమాధానమే ||జో లాలిజో||

1వ చరణం

దావీదు తనయుండై మహిమా స్వరూపుండై మానుజావతారుండై పవళించెనా (2) గాఢాంధకారంబున ఒక తార ఉదయించెనా ప్రభు బాలుడై ప్రభు యేసుడు మరియమ్మ ఒడిలోన నిదురించెనా ||జో లాలిజో||

2వ చరణం

శాంతి స్వరూపుండు కరుణా సముద్రుండు కడు శక్తిమంతుడు కమనీయుడు (2) ఆశ్చర్యకరుడాయనే ఆలోచన కర్తాయనే అభిషిక్తుడు ఆరాధ్యుడు ప్రేమామయుడు ప్రియుడేసుడు ||జో లాలిజో||