TG-2004
Telugu

ప్రభువా నీలో జీవించుట కృపా

prabhuvaa neeloo jeevinchuta krupaa

78
views
పల్లవి

ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నా యెడ కృపా బాహుల్యమే ||ప్రభువా||

1వ చరణం

సంగీతములాయె పెను తుఫానులన్నియు (2) సమసిపోవునే నీ నామ స్మరణలో సంతసమొందె నా మది యెంతో (2) ||ప్రభువా||

2వ చరణం

పాప నియమమును బహు దూరముగా చేసి పావన ఆత్మతో పరిపూర్ణమైన పాద పద్మము హత్తుకొనెదను నీలో దాగినది కృప సర్వోన్నతముగా నీలో నిలిచి కృపలనుభవించి నీతోనే యుగయుగములు నిల్చెద నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి నూతనమైన శుభాకాంక్షలతో నూతన షాలేమై సిద్దమౌదు నీకై

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.