TG-2002
Telugu

నేడు ఇక్కడ రేపు ఎక్కడో

needu ikkada reepu ekkadoo

65
views
పల్లవి

నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా (2) ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు ఎక్కడ ఆగునో ఎవరూ ఎరుగరు (2) ||నేడు||

1వ చరణం

నీవు వచ్చినప్పుడు ఏమి తేలేదులే నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో నమ్ముకుంటే నీవు మోక్షమునకు పోదువు ||నేడు||

2వ చరణం

అది నాది ఇది నాదని అదిరి పడతావు చివరికి ఏది రాదు నీ వెంట దిగంబరిగానే నీవు పుడతావు దిగంబరిగానే నీవు వెళతావు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.