చేడియలు గుంపుగూడిరి క్రీస్తు జాడఁ
cheediyalu gunpuguudiri kreesthu jaadam
పల్లవి
చేడియలు గుంపుగూడిరి క్రీస్తు జాడఁ గని తాల్మి నీడిరి ఆడికలనోర్చి నేఁడు మన పాఁలి వాఁడుసిలువ ను న్నాడు గదె యంచు ||చేడియలు గుంపుగూడిరి||
1వ చరణం
వారి మొగములు వాడెను యేసు వారి వెత లెల్ల జూడను నీరు దృక్సర సీరుహములందు జార తమ కొన గోరులను మీటి ||చేడియలు గుంపుగూడిరి||
2వ చరణం
రొమ్ములను జేతు లుంచుచు చింత గ్రమ్మి నిట్టూర్పు లిచ్చుచు కొమ్మలట నిల్పు బొమ్మలన చేష్ట లిమ్ముచెడి యబ్బు రమ్ముతో నిల్చి ||చేడియలు గుంపుగూడిరి||