♪♫
TG-3213
Telugu
చింత లేదిక యేస
Chintha Ledika Yesu
0
views
పల్లవి
చింత లేదిక యేసు పుట్టెను వింతగను బెత్లేహమందున చెంత జేరను రండి సర్వ జనాంగమా సంతసమొందుమా (2) దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి స్తుతులొనరించిరి ||చింత లేదిక||
1వ చరణం
చుక్క గనుగొని జ్ఞానులేంతో మక్కువతో నా ప్రభుని కనుగొన చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి కానుకలిచ్చిరి ||చింత లేదిక||
2వ చరణం
కన్య గర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వ మాన్యులై ||చింత లేదిక||
3వ చరణం
పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను దాపు జేరిన వారికిడు గుడు భాగ్యము మోక్ష భాగ్యము ||చింత లేదిక||