TG-1911
Telugu

వినవా మనవి యేసయ్యా ప్రభువా

vinavaa manavi yeesayyaa prabhuvaa

82
views
పల్లవి

వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా మలినము నా గతం – పగిలెను జీవితం చేసుకో నీ వశం ||వినవా||

1వ చరణం

లోక స్నేహమే కోరి దూరమైతిని వీడిపోయి నీ దారి ఓడిపోతిని విరిగిన మనసుతో నిన్ను చేరాను చితికిన బ్రతుకులో బాగు కోరాను నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా నా తండ్రి నీవేనయ్యా ఆశ ఏది కానరాక బేలనైతిని బాధలింక పడలేక సోలిపోతిని అలసిన కనులతో నిన్ను చూసాను చెదరిన కలలతో కృంగిపోయాను నన్ను సేదదీర్చి సంతోషించని యేసయ్యా నా దైవము నీవయ్యా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.