TG-1915
Telugu

రాజులకే రారాజు పుట్టాడోయ్ దివి

raajulakee raaraaju puttaadooy divi

83
views
పల్లవి

రాజులకే రారాజు పుట్టాడోయ్ దివి నుంచి భువికే వచ్చాడోయ్ ఊరూ వాడా కలిసి రారండోయ్ సంబరాలు సంబరాలు చేయండోయ్… అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని పాటలు పాడి ఆరాధింప ఊరూ వాడా రండి రండి (2) పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని ఆర్భాటించి చాటించి మోగించేద్దామా సంబరాలు సంబరాలు చేసేద్దామా – (4) పుట్టుకతోనే రాజై పుట్టిన రాజులకు రారాజు యేసయ్యని సృష్టిని శాసించే సృష్టికర్త ఏకైక దేవుడు యేసయ్యని జన్మ పాపమే లేనివాడని నీదు భారము మోయువాడని (2) ||ఆర్భాటించి||

1వ చరణం

వ్యాధి అయినను బాధలైనను విడిపించే దేవుడు యేసయ్యని కష్టమైన నష్టమైన నడిపించే దేవుడు యేసయ్యని మార్గం సత్యము జీవం యేసని మోక్ష ద్వారమై పుట్టినాడని సంబరాలు సంబరాలు చేసేద్దామా (5) క్రిస్మస్ సంబరాలు చేసేద్దామా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.