♪♫
TG-3226
Telugu
ూడరే సిలువను వ్
Choodare Siluvanu
0
views
పల్లవి
చూడరే సిలువను వ్రే-లాడు యేసయ్యను పాడు లోకంబునకై – గోడు జెందె గదా ||చూడరే||
1వ చరణం
నా చేతులు చేసినట్టు – దోషంబులే గదా నా రాజు చేతులలో ఘోరంపు జీలలు ||చూడరే||
2వ చరణం
దురితంపు దలఁపులే – పరమ గురిని శిరముపై నెనరు లేక మొత్తెనయ్యొ – ముండ్ల కిరీటమై ||చూడరే||
3వ చరణం
పరుగెత్తి పాదములు – చేసిన పాపంబులు పరమ రక్షకుని – పాదములలో మేకులు ||చూడరే||
4వ చరణం
పాపేఛ్చ తోడ గూడు – నాడు చెడ్డ పడకలే పరమ గురుని ప్రక్కలోని – బల్లెంపు పోటులు ||చూడరే||