సుమధుర స్వరముల గానాలతో

sumadhura svaramula gaanaalathoo

🎵 TG-2575🌐 Telugu
పల్లవి

సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన (2) మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2)        ||సుమధుర||

1వ చరణం

ఎడారి త్రోవలో నే నడచినా – ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము (నీవే) నీవే నా ఆధారము సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయగీతము (నీవే) నీవే నా స్తుతిగీతము వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా నీవే నీవే నా అతిశయము (నీకే) నీకే నా ఆరాధన

Report Error