TG-3254
Telugu

దేవా నా దేవా

Devaa Naa Devaa

0
views
పల్లవి

దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్ దేవా నా ప్రభువా నిన్ను స్తుతియించెదన్ (2) నిన్ను కీర్తించెదన్ – నిన్ను స్తుతియించెదన్ నీ నామమునే ఘనపరచెదన్ (2) హల్లెలూయ హల్లెలూయ యేసయ్యా హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (2) పనికిరాని నన్ను నీవు ఉపయోగ పాత్రగ మలచితివే (2) నీదు కృపతో నను రక్షించిన దేవా నీకే వందనము (2) ||హల్లెలూయ||

1వ చరణం

నీదు ప్రేమతో నను ప్రేమించి నూతన జీవితం ఇచ్చితివి (2) నీవు నాకై చేసావు త్యాగం దేవా నీకే వందనము (2) ||హల్లెలూయ||

2వ చరణం

నిన్ను నమ్మిన నీ ప్రజలకు అండగా నీవు నిలచితివి (2) మాట తప్పని నిజమైన ప్రభువా దేవా నీకే వందనము (2) ||హల్లెలూయ||