♪♫
TG-3539
Telugu
కల్వరిగిరిలోన సిల్వలో
Kalvari Girilona Silvalo
0
views
పల్లవి
కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు పలు బాధలొందెను – ఘోరబాధలు పొందెను (2) నీ కోసమే అది నా కోసమే (2) ప్రతివానికి రూపు నిచ్చె అతనికి రూపు లేదు (2) పదివేలలో అతిప్రియుడు పరిహాసములనొందినాడు (2) ||నీ కోసమే||
1వ చరణం
వధ చేయబడు గొర్రెవలె బదులేమీ పలుకలేదు (2) దూషించు వారిని చూచి దీవించి క్షమియించె చూడు (2) ||నీ కోసమే||
2వ చరణం
సాతాను మరణమున్ గెల్చి పాతాళ మందు గూల్చి (2) సజీవుడై లేచినాడు స్వర్గాన నిను చేర్చినాడు (2) ||నీ కోసమే||