TG-3543
Telugu

కళ్యాణం కమనీయం

Kalyaanam Kamaneeyam

0
views
పల్లవి

కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం (2) దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా (2) ||కళ్యాణం||

1వ చరణం

ఏదెను వనమున యెహోవ దేవా మొదటి వివాహము చేసితివే (2) ఈ శుభ దినమున నవ దంపతులను (2) నీ దీవెనలతో నింపుమయ్యా ||దేవా రావయ్యా||

2వ చరణం

కానా విందులో ఆక్కరనెరిగి నీళ్ళను రసముగ మార్చితివే (2) కష్టములలో నీవే అండగా నుండి (2) కొరతలు తీర్చి నడుపుమయ్యా ||దేవా రావయ్యా||

3వ చరణం

బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు గుప్తమైయున్నవి నీయందే (2) ఇహ పర సుఖములు మెండుగ నొసగి (2) ఇల వర్ధిల్లగ చేయుమయ్యా ||దేవా రావయ్యా||