TG-3542
Telugu

కల్వరిలోన చేసిన

Kalvarilona Chesina

17
views
పల్లవి

కల్వరిలోన చేసిన యాగం మరణము గెలిచిన నీ యొక్క త్యాగం (2) కడిగి వేసెను నాదు పాపం నిలిపె నాలో నీ స్వరూపం (2) ||కల్వరిలోన||

1వ చరణం

ఆ పాపులు అలుపే లేక నిను కొట్టిన దెబ్బలు తొలగించే నాపై ఉన్న ఆ ఘోర శాపాలు పరిశుద్ధ దేహముపై చెలరేగెను కొరడాలు నాలోని రోగాలకై పొందితివా గాయాలు (2) దైవ సుతుడవే అయిన గాని కనికరము వీడవు ఏల క్షణమైనా గాని (2) ||కల్వరిలోన||

2వ చరణం

ఏ దోషం లేని దేహం మోసెను సిలువ భారం రద్దాయెను నాలో నేరం తగ్గించెను నా భారం నువ్వు పొందిన అవమానం నను ఉన్నతి చేర్చెను చిందించిన నీదు రక్తం పరిశుద్ధుని చేసెను (2) నిన్నే బలిగా నువ్వు మార్చుకుంటివి నన్ను రక్షించుటకు వేదన పడితివి (2) ||కల్వరిలోన||

3వ చరణం

సిలువలో వ్రేలాడుతూ నువ్వు పొందిన దాహము అందించేను నా కొరకై ఆ జీవ జలము కఠినులుగా మారి నీకు అందించిన ఆ చేదు నింపేను నాలో మధురం తొలగించే నా కుటిలం (2) అధికారమే లేని మరణము నిలిచెను నిన్ను తాకేందుకు అనుమతి కోరెను (2) ||కల్వరిలోన||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.