TG-3544
Telugu

కమనీయమైన

Kamaneeyamaina

16
views
పల్లవి

కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్యా కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్యా (తీయ) తీయని నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్యా (2) నా హృదిలో కొలువైన నిన్నే సేవించనా/సేవించెదా నా యేసయ్యా (2) విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం (2) సమర్పణతో నీ సన్నిధిని చేరి నిత్యము నిన్నే ఆరాధించనా (2) ||కమనీయమైన||

1వ చరణం

వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా (2) కన్నీటితో నీ పాదములు కడిగి మనసారా నిన్నే పూజించనా (2) నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా (2) ||కమనీయమైన||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.