♪♫
TG-3540
Telugu
కల్వరి గిరిపై సిలువ
Kalvari Giripai Siluva
0
views
పల్లవి
కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా నా పాపముకై నీ రక్తమును సిలువ పైన అర్పించితివా (2) దుష్టుండనై బల్లెము బూని గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన (2) కేక వేసి నీదు ప్రాణం సిలువ పైన అర్పించితివా (2) ||కల్వరి||
1వ చరణం
మూడు దినములు సమాధిలో ముదము తోడ నిద్రించితివా (2) నా రక్షణకి సజీవముతో సమాధిన్ గెల్చి లేచిన తండ్రి (2) ||కల్వరి||
2వ చరణం
ఆరోహణమై వాగ్ధానాత్మన్ సంఘము పైకి పంపించితివా (2) నీ రాకడకై నిరీక్షణతో నిందలనెల్ల భరించెదను (2) ||కల్వరి||