♪♫
TG-3326
Telugu
ఈ ఉదయ
Ee Udayam
0
views
పల్లవి
ఈ ఉదయం – శుభ ఉదయం ప్రభువే నాకొసగిన – ఆనంద సమయం ఆశ్రయించెదన్ – దివ్య వాక్యమున్ ప్రేమతోడ సరిచేసే – శ్రేష్ఠ సత్యమున్ ||ఈ ఉదయం||
1వ చరణం
బలహీనమైతి నేను – బలపరచుము తండ్రి ఫలహీనమైతి నేను – ఫలియింపజేయుము వాక్య ధ్యానమే – నీ ముఖ దర్శనము పరిశుద్ధ పరచెడి – పరమతండ్రి మార్గము ||ఈ ఉదయం||
2వ చరణం
అస్థిరమునైతి నేను – స్థిరపరచుము తండ్రి అల్పవిశ్వాసి నేను – అద్దరికి జేర్చుము నీ పాదసన్నిధే – నాకు శరణము అభయంబునిచ్చెడి – ఆశ్రయపురము ||ఈ ఉదయం||