TG-4736
Telugu

ఎందుఁబోయెదవో హా ప్రభురాయ,

Endunbooyedavoo Haa Prabhuraaya,

0
views
పల్లవి

ఎందుఁబోయెదవో హా ప్రభురాయ ఎందుఁబోయెదవో ఎందుఁ బోయెదవయ్య యీ దుర్మానవశ్రేణి బొందఁదగిన భరంబుఁ బూని రక్షక నీవు ||ఎందు||

1వ చరణం

1.  వడగాలిలోను నీ నెమ్మోము వాడికందఁగను నొడలఁ జెమటయు నీరు నొడిసివర దయై పార నడుగులు తడఁబడ నయ్యా యిప్పుడు నీవు ||ఎందు||

2వ చరణం

2.  మూఁపుపై సిలువ శత్రు స మూహముల్ నడువఁ కాపు ప్రచండమౌ కారెండ కాయఁగ నేపున నా పాప మీ పాటు పెట్టఁగ ||ఎందు||

3వ చరణం

3.  విరువు గట్టివియో జనుల రక్షించు బిరుదలయ్యవియో పరమ రక్షకుండా నా పాపబంధము లవియో పరిశోదించెడి వారి పట్టుకొమ్మలవియో ||ఎందు||

4వ చరణం

4.  ఆకాశమందు దూతలు కొల్వ నతితేజ మొందు ప్రాకటమైన నీ సదముల్ పగులురాల తాఁకునఁబగిలి ర క్త ధారలొల్కఁగను ||ఎందు||

5వ చరణం

5.  పరమందుఁగల్గు పరిమళముచేఁ బసమించి వెల్గు చిరమౌ దేహమునకు నా యెరుష లేమను నట్టి పురములోపలి మన్ను పూత మయ్యెనా ప్రభువా ||ఎందు||

6వ చరణం

6.  ఒక పాలివెతలా రవ్వంతైన సుకరమౌ స్థితులా యకటా చెదరి గుండె లదరి ఝుల్ ఝుల్మని యొకటిఁ బొందక తాప మొంది కుందునే కర్త ||ఎందు||