కఠినమైన హృదయాన్నీ కరిగించే ప్రేమ
Kathinamaina Hrudayaannee Kariginchee Preema
కఠినమైన హృదయాన్నీ కరిగించే ప్రేమ కరుణలేని మనసులో కన్నీటిని పుట్టించే ప్రేమ ప్రేమా ప్రేమా అది దేవుని ప్రేమా ||కఠినమైన||
అమ్మ కడుపులో నాకు ప్రాణమిచ్చిన ప్రేమ అన్నీ కోల్పోయి నేనుంటే అండగా నిలిచిన ప్రేమ ఆరిపోయే నా ఆత్మ దీపాన్ని వెలిగించిన ప్రేమా అది నా దేవుని ప్రేమా ||కఠినమైన||
ఎవరికి తెలిసిందీ ఈ ప్రేమ ఎవరు గుర్తించారు ఈ ప్రేమ వేకువ ఉదయాన విరిసిన కమలం నా ఈ దేవుని ప్రేమ కన్నీటి హృదయాన కుమ్మరించే పసిపాప చిరునవ్వు నా దేవుని ప్రేమా ||కఠినమైన||
లోకం గుర్తించనిదీ ఈ పరలోక ప్రేమ మనిషికి అర్థం కానిదీ ఈ కల్వరి ప్రేమ ఏ కవీ రాయలేని కమ్మనైన ప్రేమగీతం ఈ దేవుని ప్రేమా ఎదలోతుల్లో దాగిన నులివెచ్చని ఆత్మ స్పర్శ నా దేవుని ప్రేమా ఎవరికి తెలిసిందీ ఈ ప్రేమ ఎవరు గుర్తించారూ నా ఈ దైవుని ప్రేమ ||కఠినమైన||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.