విసుకదే ప్రాణంబు విజ్ఞాని కిలను

visukadee praannanbu vijnyaani kilanu

🎵 TG-478💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

విసుకదే ప్రాణంబు విజ్ఞాని కిలను పొసగు వైరాగ్యంబు పుట్టదే తలను అసదు గానట్టి కష్టానుభవమే గాని యసదృశానంద ఫల మొసగుఁ నది యేది ||విసుకదే ప్రాణంబు||

1వ చరణం

మును పేది యుండెనో వెనుక నదియే యుండు మునుపు వెనుకకు మధ్య మున నున్న దదియే నొనరంగఁ గ్రొత్తయై యుత్పన్నమగు నట్టి ఘనకార్య మొక్కటియుఁ గానంగరాదు ||విసుకదే ప్రాణంబు||

2వ చరణం

ధరణి మీఁదికి దిగం బరుఁబగుచు నేతించు మరణ మప్పుడు దిగం బరుఁడగుచుఁ బోవున్ నర్రుడు పుట్టినఁడు సరెకెద్దియును తేఁడు మరణమగు నాఁడొక్క సరకుగొనిపోఁడు ||విసుకదే ప్రాణంబు||

3వ చరణం

ఒక తరము పోవు మరియొక తరము జనుదెంచు సకల వంశము లిట్లు సమసిపోవుచుండు నిఁక వారి పేర్పింపు లెచ్చోట నేమాయె నొకండైన చెప్పుటకు నుర్విలో లేఁడు ||విసుకదే ప్రాణంబు||

4వ చరణం

ఏటివంకలు దీర్చ నెవ్వాని కలవి ము న్నీటి మూఁకుడు సేయ నేర్పరి యెవండు మోటైన మనసు వం పులు దీర్చు గురు వెవఁడు కోటి ధనమిచ్చినను కుంభినిని లేఁడు ||విసుకదే ప్రాణంబు||

5వ చరణం

ధరణిలో నరరూపు దాల్చి పాపుల కొఱకు మరణమై లేచు స ద్గురు డైన యేసు చరణాబ్జముల సేవ సారమిది యొక్కటే పరమ ఫలమిడు సుఖ ప్రాప్తి యొనరించున్ ||విసుకదే ప్రాణంబు||

Report Error