ఏమి తలచి తలచి ఊపిరి పోసితివో ఎందుకింత కరుణ చూపి
Eemi Thalachi Thalachi Oopiri Poosithivoo Endukintha Karuna Choopi
ఏమి తలచి తలచి ఊపిరి పోసితివో ఎందుకింత కరుణ చూపి ఇన్నాళ్లు కాచితివో తెలియకనే గడిచేనయ్య పాత రోత జీవితం మన్నించి నొసగుమయ్య క్రొత్త నీతి జీవితం పాపినని పారవేయక నీ బాహువులో దాచావయ్యా ప్రనమిల్లి మ్రొక్కెద నీ పాదములన్ నా యేసు రాజా నజరేయుడా నా తల్లి గర్భములో నా రూపమునే గీసి నీ జీవము నాకొసగి బ్రతుకమని సెలవిచ్చావు నా బ్రతుకు బాటలో తప్పటడుగులే ఉన్నా ఆకుపై మంచు వలె నన్ను హత్తుకున్నావు ఎందుకింత ప్రేమ నాపై తాళలేకున్నాను చిత్తము నా తండ్రి నీ చిత్తమునే నే చేతును శ్రీమంతుడా శిరస్సువంచి ఆరాధింతునయ్యా ఘనమైన నీ నామము ఏర్పరచబడిన సంఖ్యలో నన్ను చేర్చి విడువక రక్షించి కాపాడినావు నా బ్రతుకు దినములన్ని నీ గ్రంథములో రాసి వింతైన ప్రేమను నాపై కురిపించావు ఎందుకింత ప్రేమ నాపై తాళలేకున్నాను చిత్తము నా తండ్రి నీ చిత్తమునే నే చేతును శ్రీమంతుడా శిరసువంచి ఆరాధింతునయ్యా ఘనమైన నీ నామము
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.