కనులున్న కానలేని చెవులున్న వినలేని మనసున్న మతిలేని
Kanulunna Kaanaleeni Chevulunna Vinaleeni Manasunna Mathileeni
కనులున్న కానలేని - చెవులున్న వినలేని (2) మనసున్న మతిలేని - స్థితియున్న గతిలేని (2) వాడను యేసయ్యా - ఓడిపోయిన వాడను (2) ||కనులున్న||
అన్నీవున్న ఏమిలేని - అందరు ఉన్న ఏకాకిని దారివున్నా కానరాని - చెంతనున్న చేరలేని యేసయ్యా... నన్ను విడువకయ్యా (2) దిక్కులేనివాడను వాడను యేసయ్యా - చెదరిపోయిన గూడును (2) ||కనులున్న||
భాషలున్న భావములేని - ఆత్మవున్న అవివేకిని భక్తివున్న శక్తిలేని - ప్రార్ధనవున్నా ప్రేమలేని యేసయ్యా... నన్ను కరుణించుమా (2) ఫలములేనివాడను వాసిని యేసయ్యా - పేరుకు మాత్రమే విశ్వాసిని (2) ||కనులున్న||
బోధవున్నా బ్రతుకులేని - పిలుపువున్న ప్రయాస పడని సేవవున్నా సాక్ష్యము లేని - సంఘమున్న ఆత్మలు లేని యేసయ్యా... నన్ను నింపుమయ్యా (2) ఆత్మలేని వాడను పాదిరిని యేసయ్యా - మాదిరి లేని కాపరిని (2) ||కనులున్న||