♪♫
TG-3356
Telugu
ఎన్ని తరములు స్తుతియించినా
Enni Tharamulu Sthuthiyinchinaa
0
views
పల్లవి
ఎన్ని తరములు స్తుతియించినా (2) తీరునా నీ ఋణం (4) నా ప్రాణము – నా జీవము (2) నీవే నా యేసయ్యా నీవే నా మెస్సయ్యా ||ఎన్ని||
1వ చరణం
కరిగిపోని కన్నీరెంతో కుమ్మరించాను – కుమ్మరించాను (2) కరుణామయుడా కన్నులు తుడిచి (2) (నీ) కృపను చూపావు – కృపను చూపావు (2) ||నా ప్రాణము||
2వ చరణం
పాపములోనే పుట్టిన వారిని పరిశుద్ధపరచితివి – పరిశుద్ధపరచితివి (2) పరమ తండ్రి పవిత్రతతోనే (2) (నీ) పరమున చేర్చెదవు – పరమున చేర్చెదవు (2) ||నా ప్రాణము||