TG-3365
Telugu

ఎంత మంచి కాపరి

Entha Manchi Kaapari

0
views
పల్లవి

ఎంత మంచి కాపరి – యేసే నా ఊపిరి (2) తప్పిపోయిన గొర్రె నేను వెదకి కనుగొన్నావయ్యా నీ ప్రేమ చూపినయ్య (2) ||ఎంత||

1వ చరణం

సుఖములంటూ లోకమంటూ నీదు భాగ్యం మరచితి నీదు సన్నిధి విడచితి (2) యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా నా అతిక్రమములు క్షమియించి జాలి చూపితివి (2) ||ఎంత||

2వ చరణం

నా తలంపులు నా క్రియలు నీకు తెలిసేయున్నవి నీవే నిర్మాణకుడవు (2) యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా కృతజ్ఞతా స్తుతులు నీకు సమర్పించెదను (2) ||ఎంత||