♪♫
TG-3665
Telugu
మహోన్నతుడా నీ కృపలో
Mahonnathudaa Nee Krupalo
18
views
పల్లవి
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట (2) ||మహోన్నతుడా||
1వ చరణం
మోడుబారిన జీవితాలను చిగురింప జేయగలవు నీవు (2) మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు (2) ||మహోన్నతుడా||
2వ చరణం
ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలియించినా (2) జీవ జలముల ఊట అయిన నీ ఓరన నను నాటితివా (2) ||మహోన్నతుడా||
3వ చరణం
వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి యుంచితివా (2) వాగ్ధాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా (2) ||మహోన్నతుడా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.