TG-3664
Telugu

మహోన్నతుడా మా దేవా

Mahonnathudaa Maa Devaa

0
views
పల్లవి

మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా (2) ఉదయ కాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము (2) మా స్తుతి నీకేనయ్యా ఆరాధింతునయ్యా (2) ||మహోన్నతుడా||

1వ చరణం

అగ్నిని పోలిన నేత్రములు అపరంజి వంటి పాదములు (2) అసమానమైన తేజో మహిమ కలిగిన ఆ ప్రభువా (2) ||మా స్తుతి||

2వ చరణం

జలముల ధ్వని వంటి కంట స్వరం నోటను రెండంచుల ఖడ్గం (2) ఏడు నక్షత్రముల ఏడాత్మలను కలిగిన ఆ ప్రభువా (2) ||మా స్తుతి||

3వ చరణం

ఆదియు అంతము లేనివాడా యుగయుగములు జీవించువాడా (2) పాతాళ లోకపు తాళపు చెవులు కలిగిన ఆ ప్రభువా (2) ||మా స్తుతి||