మల్లెలమ్మా మల్లెలు
Mallelammaa Mallelu
మల్లెలమ్మా మల్లెలు – తెల్ల తెల్లని మల్లెలు (2) ఏ మల్లెలోన వస్తాడో – రానున్న యేసయ్యా (2) నీవచ్చే రాకడలో జరిగే గుర్తులు తెలిసాయి (2) జరుగుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||
అక్కడక్కడ కరువులు భూకంపాలే లేచాయి (2) నీ రాకడ సమీపమయ్యింది – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||
రాజ్యము మీదికి రాజ్యములు జనముల మీదికి జనములు (2) లేచుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||
పదవుల కొరకే ఈనాడు పార్టీలెన్నో పెరిగాయి (2) పరిశుద్ధుల పాలిట నీవయ్యో – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||
పురుగులు పట్టి ఈనాడే పైరులు ఎన్నో పోయాయి (2) రోజులు మారే రోజాన్నో – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||
నీతి న్యాయం నివసించే పాపుల పరుగే గెలిచాయి (2) పరిశుద్ధుల పాలిట నీవయ్యో – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.