TG-4900
Telugu

ఘన యెహోవా నీ గుడారం బున నతిథియౌ

Ghana Yehoovaa Nee Gudaaran Buna Nathithiyau

0
views
పల్లవి

ఘన యెహోవా నీ గుడారం బున నతిథియౌ వాడెవండు తనర నీ పరిశుద్ధ పర్వత మున వసించెడు వాఁడెవండు ||ఘన||

1వ చరణం

1.  వెలఁయగను యథార్థ వర్తన గలిగి నీతి ననుసరించుచు నెలమితో మనసార నిజము పలుకు చుండువాఁడై సుమ్మ ||ఘన||

2వ చరణం

2.  తనదు నాల్కతోఁగొండె మాడఁడు తన సఖునకును గీడు చేయఁడు తనదు పొరుగు వానిపై నిం దలను మోపఁడించు కేనియు ||ఘన||

3వ చరణం

3.  వానికిని నీచుం డసహ్యుడు వాఁడు భక్తుల గౌరవించును హాని కలిగిన నాతఁడును బ్ర మాణ మాడియు మాట తప్పఁడు ||ఘన||

4వ చరణం

4.  మరియు ద్రవ్యము వడ్డి కీయఁడు నిరపరాధినిఁ జెఱప లంచము అరయఁ డిట్టులఁ జేయువాఁడే ధర నెపుడు గదల్పఁబడఁడు ||ఘన||

5వ చరణం

5.  జనక తనయ పావనాత్మకు ఘన మహిమయు కల్గుఁగాక మును పిపుడు నెల్లప్పుడున్ యుగ ములకుఁ గల్గునుగాక యామేన్