పరిశుద్ధాత్ముఁడ ప్రభువ! వరదా! మా

parishuddhaathmumda prabhuva! varadaa! maa

🎵 TG-246💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

పరిశుద్ధాత్ముఁడ ప్రభువ! వరదా! మా హృదయమం దిరముల వసి యింపుమా అరుదైన నీదివ్య తరశక్తులను దాల్చి త్వరగా మాపై దిగుమా కరుణాబ్ధివై యిపుడు ||పరిశుద్ధాత్ముఁడ ప్రభువ!||

1వ చరణం

పరమండలాగ్నివై యరుదెంచి మా హృదయాం తర దురితతూలం బును దరికొల్పి పరిశుద్ధ పఱచి మా యాత్మల మా వరరక్షకునకు న ర్పణ ముగా నిడుమయ్య ||పరిశుద్ధాత్ముఁడ ప్రభువ!||

2వ చరణం

కాంతులీనెడు దీప కలికవైవచ్చి మా స్వాంతంబులఁగప్పిన యంతు లేని యవిద్యా ధ్వాంతంబుఁ జోపి సు స్వాంతులేగెడు సత్య సరణిఁ జూపింపుమా ||పరిశుద్ధాత్ముఁడ ప్రభువ!||

3వ చరణం

చలువఁ గూర్చెడు మంచు జల్లురూపమున మ మ్ముల నెల్ల దీవింపుమా ఫలశూన్యంబైన యా ఆత్మలకు నీ బల మొసఁగి ఫలవంతములుగ గే వలుఁడా యొనరింపుమా ||పరిశుద్ధాత్ముఁడ ప్రభువ!||

4వ చరణం

పరమ పారావతమా! పక్షములు విప్పి మా శిరములపైని చాఁచి పరమందు నీ సంఘ పరిశుద్ధులకువలెనె ధరనున్న మాకు నీ వరముల నిడుమయ్య ||పరిశుద్ధాత్ముఁడ ప్రభువ!||

5వ చరణం

దివినుండి భువికి నా రవముతో వీతెంచు పవమానాకారుండవై నవ జన్మసంప్రాక్తికవరోధమొనరించు భవదుఃఖాంబుద పటలిఁ బాఱఁ దోలుము కృపచేఁ ||పరిశుద్ధాత్ముఁడ ప్రభువ!||

6వ చరణం

అందమౌ నీమోము నందుఁ జిందెడు తేజ మందఱు వీక్షింపగా విందవై వచ్చి మా డెందంబులకు నిత్యా నందంబుఁగూర్చి మా వందనంబులు గొనుమా ||పరిశుద్ధాత్ముఁడ ప్రభువ!||

Report Error