TG-4903
Telugu

ఘనదేవ ప్రియ తనయుండా జగద్రక్షా

Ghanadeeva Priya Thanayundaa Jagadrakshaa

1
views
పల్లవి

ఘనదేవ ప్రియ తనయుండా జగద్రక్షా వినుతి జేతుము నీ మహిమన్ ఘనతరంబుగ గత సంవత్సర దినము లన్నిట మాకు నీభువి ఘనసుఖము లొనరించి మరి నూతనపు వత్సర మొసగినందుకు ||ఘనదేవ||

1వ చరణం

1.  అధిక ప్రేమలొసఁగుము యేసు ప్రభు కుదురుగ నీ వత్సరము ప్రధమ దినమున మమ్ము నందరి ముదముతో నిచ్చటకుఁ జేర్చితి ప్రబలమగు సంగీతస్తుతులను మిగులబొందుము యేసు రక్షక ||ఘనదేవ||

2వ చరణం

2.  అంచితముగ నిచ్చటన్ గూడిన సభలో స్త్రీలన్ బురుషుల బిడ్డలన్ మంచి మార్గమునుంచి నీ యత్యంత ప్రేమతోఁ గావు మిలను చంచలులు గాకుండ నీ కృప లుంచి మము రక్షించుమో ప్రభు ||ఘనదేవ||

3వ చరణం

3.  దీవించు ప్రభుయేసువా సువార్తికులన్ సావధానముగా భువిలో భావమందున నీపదంబుల సేవ బాగుగఁ జేయుచున్ నీ జీవజల వాక్యంబులన్ ధర ధీరతనుఁ బ్రకటింపఁ జేయుము ||ఘనదేవ||

4వ చరణం

4.  పరముండ ధర నీ సభలన్ నూతనముగ స్థిరపర్చి బలపర్చుము సరసముగ నాశీర్వచనము ల్విరివిగా నొసంగుచున్ నూ తన సహోదర ప్రియుల సమితిని మరియుఁ జేర్చుము నీ సభలలో ||ఘనదేవ||

5వ చరణం

5.  కరుణాళ యీవత్సరము క్రైస్తవ బడుల ధరణిబ్రబలఁ జేయుమా సరిగ నుపాధ్యాయులందరి మరి మరీ దీవించు ప్రభువా స్థిరముగా పరమార్ధములు బా లురకు గరవుచునుండఁ జేయుము ||ఘనదేవ||

6వ చరణం

6.  భాసురంబుగ పరలోక ప్రకాశుఁడా దాసబృందములన్ గావు వాసిగా నరలోకము నని వాసులగు మీ దాసులందరి దోషరాసిని ద్రోసి నీ కృప జూపుచును రక్షించు మనిశము ||ఘనదేవ||