TG-4658
Telugu

ఈయన మాట వినుడి నేడు

Eeyana Maata Vinudi Needu

0
views
పల్లవి

ఈయన మాట వినుడి - నేడు - ఈయనే నా ప్రియ కుమారుడు 1.  ఈయనే నా ప్రియ కుమారుడు - శాపముతీర్చెడు పాపరహితుడు దైవకుమారుండీయనే 2.  ఈయనమాట నిరాకరించెడివారు - తప్పించుకొనరు దైవదండనను దహించబడుదు రెల్లప్పుడు 3.  మహిమగల రాజు మాట నిచ్చెను - ఇహమందాయన మాటను దెల్ప మహాసైన్యము లేచెను 4.  పరలోక దేవుని దర్శనమునకు - స్థిరులై యుండెదము మరలక మనము విధేయులై వికసింతుము 5.  దాసుని స్వరూపమును దాల్చెను - మరణము పొందునంత విధేయుడై రిక్తుడుగ మరణించెను 6.  పరమందునుండు వారిలోగాని - భూమి యందును - భూమిక్రిందైన పూజనీయుడీయనే 7.  సర్వశక్తిగల ప్రభువునకు - స్తోత్రము ఘనత మహిమ ప్రభావము నిత్యము కల్గును గాక