TG-3426
Telugu

గుండె నిండా యేసు ఉంటే

Gunde Nindaa Yesu Unte

0
views
పల్లవి

గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం (2) గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే (4) లోక స్నేహం వెలివేసినా శోకంలో ముంచి వేసినా – నీవే నా నేస్తం నా హృదయం చెప్పేదొక్కటే గుండె నిండా నువ్వే (2) ||గుండె నిండా నువ్వే||

1వ చరణం

ఊపిరంతా శాపమైనా గాలి కూడా గేలిచేసినా – నీవే నా చెలిమి జాలి లేని ఇలలోన నీవే నా కలిమి (2) ||గుండె నిండా నువ్వే||

2వ చరణం

చిరకాలం నీ ఒడిలో ఉండాలని ఆశతో చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్నా గీతం (2) ||గుండె నిండా నువ్వే||