TG-4961
Telugu

చూచి జీవించు యేసునాథుని

Choochi Jeevinchu Yeesunaathuni

0
views
పల్లవి

1.  యేసునాథుని గాయములను చూడుము - నిత్యజీవము పొందెదవు ప్రాణమిచ్చి విమోచించిన వానిని - నమ్మివచ్చి చేరి చూడుము పల్లవి: చూచి జీవించు - యేసునాథుని గాయములను చూడుము నిత్యజీవము పొందెదవు 2.  పాపభారము మోసిన రక్షకునిచే - నీ నేరము తొలగెన్ జీవనాథుడు కార్చిన రక్తముచే - నీ పాప ఋణము తీరెన్ 3.  ఏ క్రియలు ప్రార్థన కన్నీళ్ళును - ఇన్ను రక్షింపజాలవు రక్తంబే ఆశ్రయమని వచ్చిన - కరుణించు విమోచకుడు 4. పాప ప్రాయశ్చిత్త క్రియలు ముగిసె - అని ప్రభువే పల్కెను సర్వలోకపు నేర పాపమున్ - సిలువలో నివృత్తి జేసెన్ 5.  పాపనాశకుడు ఇచ్చు రక్షణను - ఈ క్షణమే పట్టుకొనుము నీ నీతియగు యేసు పుణ్యముచే - మోక్షానందముల పొందెదవు