TG-4966
Telugu

చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక

Choochuchunnaamu Nee Vaipu Maa Priya Janaka

0
views
పల్లవి

చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక – చూచుచున్నాము నీ వైపు చూచుచు నీ ప్రేమ – సొంపు సువార్తను జాచుచు గరములు – చక్కగా నీవైపు ||చూచు||

1వ చరణం

మేమరులమై యుంటిమి మార్గము వీడి – మేమందరము పోతిమి ప్రేమచే నప్పుడు – ప్రియ తనయు నంపించి క్షేమ మార్గము మాకు – బ్రేమను జూపితివి ||చూచు||

2వ చరణం

నిను నమ్ము పాపులకు వారెవరైనా – నీ శరము జొచ్చువారలకు ఇనుడవు కేడెంబు – నీ జగతిలో నగుచు గనుపరచుచుందువు – ఘనమైన నీ కృప ||చూచు||

3వ చరణం

నీ భయము మాయెదలను నిలుపుము నీదు – ప్రాభవ మొనరంగను నీ భయముచే మేము – వైభవ మొందుచు నే భయము లేకుండ – నీ భువిని గొన్నాళ్ళు ||చూచు||

4వ చరణం

దయ జూచి మము నెప్పుడు మంచివి యన్ని – దయచేయు మెల్లప్పుడు దయచేయరానివి – దయచేయుమని కోర దయ జూపి మన్నించు – దయగల మా తండ్రి ||చూచు||