TG-4962
Telugu

చూచితి నీ మోముపై చిందిన రక్తము

Choochithi Nee Moomupai Chindina Rakthamu

0
views
పల్లవి

చూచితి నీ మోముపై – చిందిన రక్తము తలచితి నీ ప్రేమను – మదికి అందనిదాయె రాజ మకుటము మారిపోయే – ముళ్ల మకుటముగా సింహాసనమే సిలువగ మారి – శిక్షకు గురియాయేగా పరిమితి లేని కలువరి ప్రేమను – పరిహాసము చేసిరే ఆ ప్రేమనెరిగి నీ పాద సేవయే – చాలని నీ చెంత చేరితిని యేసు.. ||చూచితి||

1వ చరణం

నేలపై ఒలికిన నీ రక్తధారలే – ప్రతి పాపిని కడిగెను ఆ రక్తధారలే పాపికి మార్గమై – పరముకు ప్రవహించెను (2) మట్టి దేహమును – మహిమగ మార్చుటకు (2) మాపై నీకున్న సంకల్ప ప్రేమను – పరిహాసము చేసిరే (2) యేసు.. ||చూచితి||

2వ చరణం

సిలువలో చిందిన రక్తపు జల్లులు – ప్రతి రోగిని తాకెను చితికిన దేహమున ఒలికిన రుధిరము – పరమౌషధమాయెను (2) మా రోగములను – భరియించుటకు (2) మాపై నీకున్న ఎనలేని ప్రేమను – అవహేళన చేసిరే (2) యేసు.. ||చూచితి||