TG-4967
Telugu

చూడ గోరెద దేవ మందిరావరణములను

Chooda Gooreda Deeva Mandiraavaranamulanu

0
views
పల్లవి

చూడ గోరెద దేవ మందిరావరణములను చూడ గోరెద చూడ నాకు నాశ గలదు సుందరావరణములవి చూడ నాదు ప్రాణమెంతో సొమ్మసిల్లుచున్నదహా ||చూడ||

1వ చరణం

1.  నీదు నివాసములు జూడ నెంతో రమ్యమై తనర నాదు హృదయమునకు నానంద మిచ్చు నిపుడు నెపుడు ||చూడ||

2వ చరణం

2.  జీవము గల ప్రభుని జూడ జీవి నాలో కేక వేసె కోవెలలకు దొఱికె గూటి తావు నీ మందిరమున ||చూడ||

3వ చరణం

3.  పిచ్చుకలకు దొఱికె స్థలము ముచ్చట బలిపీఠ మెదుట పెట్టు కుతూహలముతోను పిల్లల నవి మందిరమున ||చూడ||

4వ చరణం

4.  నీదు మందిరంబులోన నిత్యవాసులైనవారు నిక్కముగను ధన్యులగుచు నిన్ను నన్నుతింతు రహా ||చూడ||

5వ చరణం

5.  ప్రభుని వలన బలము నొందు ప్రజలు ధన్యులగుదు రిల ప్రాణ ప్రియము యాత్ర సేయు ప్రజల మార్గ మమర ధరను ||చూడ||

6వ చరణం

6.  నీదు యావరణములలో నేను నొక్క దినము గడుప నెంతో విలువ గల నాకు వేయినాళ్ల బ్రతుకు కన్న ||చూడ||

7వ చరణం

7.  కానరండు మనము నిపుడె మనము లలర ప్రభుని జూడ మందిరమున కేగి నిండు మనశ్శాంతి బొంది బ్రతుక ||చూడ||