♪♫
TG-3431
Telugu
హల్లే హల్లే హల్లే హల్లేలూయా
Halle Halle Halle Hallelooyaa
0
views
పల్లవి
హల్లే హల్లే హల్లే హల్లేలూయా ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయా (2) నిను చూడని కనులేల నాకు నిను పాడని గొంతేల నాకు (2) నిను ప్రకటింపని పెదవులేల నిను స్మరియించని బ్రతుకు ఏల (2) ||హల్లే||
1వ చరణం
నే పాపిగా జీవించగా నీవు ప్రేమతో చూచావయ్యా (2) నాకు మరణము విధియింపగా నాపై జాలిని చూపితివే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) యేసయ్యా యని మొరపెట్టగా నీ దయ చేత దృష్టించినావే (2) ||నిను||
2వ చరణం
నా శాపము తొలగించినావు నా దోషము భరియించినావు (2) నాకు జీవం మార్గం నీవైతివయ్యా నిత్య నరకాన్ని తప్పించినావు (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) యేసయ్యా యని విలపించగా నీ కృప చేత రక్షించినావు (2) ||నిను||