♪♫
TG-2389
Telugu
ఆనందింతుము ఆనందింతుము యేసుని సన్నిధిలో
aanandinthumu aanandinthumu yeesuni sannidhiloo
76
views
పల్లవి
ఆనందింతుము ఆనందింతుము యేసుని సన్నిధిలో ఆనందింతుము.. హే (2) గంతులేసి నాట్యమాడి ఉత్సహించి పాడెదం యేసుని సన్నిధిలో ఆనందింతుము (2) ||ఆనందింతుము||
1వ చరణం
భయమూ ఎందుకూ… దిగులూ ఎందుకూ దేవాది దేవుని తోడు మనకుండగా హల్లెలూయ అంటు ఆరా-ధింతుము ఎల్లప్పుడూ యేసుని సన్నిధిలో ధైర్యమొందెదం నీతి లేని లోకంతో స్నేహం ఎందుకూ నీతి సూర్యుడైన యేసు మనకూ ఉండగా పరిశుద్దుడంటూ పొగడి కొలిచెదము అనుదినం యేసుని సన్నిధిలో పరవశించెదం ప్రేమలేని హితుల సఖ్యం ఎందుకూ ప్రేమామయుడైన ప్రభువు మనకు ఉండగా! మహిమకరుడు అంటూ మ్రొక్కి పూజింతుము అనుక్షణం యేసుని సన్నిధిలో ఉత్సాహించెదం
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.