TG-4602
Telugu

ఇదిగో శుభద రక్షణము

Idigoo Shubhada Rakshanamu

0
views
పల్లవి

ఇదిగో శుభద రక్షణము దేవుఁడు పంపె నిదిగో శుభద రక్షణము సదమలంబగు పూర్వ సత్యవాక్యమునందు మృదువుగా దీర్ఘ ద ర్శుల చేతఁ బలుకఁబడె ||ఇదిగో||

1వ చరణం

1.  అలపిశాచముతోడను దేవుఁడు తొల్లిఁ బలుకు వాక్యము జాడను పొలతి సంతతి నిన్ను తలఁగొట్ట బుట్టునని తెలియఁజేసెను మోషె దీర్ఘ దర్శన వాక్య ||ఇదిగో||

2వ చరణం

2. ఘన దివ్య బలిచేయను పాపములెల్లఁ దునిమి పుణ్యము లియ్యను ఒనరఁగ నీ కాల మునఁ గ్రీస్తు వచ్చునని మును దానియేలు బ ల్కెను దీర్ఘ దర్శనము ||ఇదిగో||

3వ చరణం

3.  యూద రాజ్యములోపట బెత్లేమనెడి యూరఁ గ్రీస్తుడు బుట్టుట ఆదిలోన మీకా యను దీర్ఘ దర్శిచే మోదమునఁ దెల్పబడె ముందు వేదమునందు ||ఇదిగో||

4వ చరణం

4.  మన దోషముల కొఱకునై యేసుని కాయ మది గాయముల హ్రస్వమై మన రక్షకుని పాట్లు గనినట్టుల యెషయ్య మును దెల్పె దీర్ఘద ర్శన వాక్యముల నిచ్చి ||ఇదిగో||