ఏల చింత యేల వంత యిచట నీకు క్రైస్తవ పాలకుండు యేసు నీదు వంత లెల్ల నెరుఁగుఁగా ||ఏల చింత||
తొల్లి నీ వొనర్చినట్టి దోష మెంతో జూడుమా కల్లగాదు యేసు క్రీస్తు చెల్ల చెదరఁ జేసెఁగా ||ఏల చింత||
నీకు కాలు జారినపుడు నిన్ను లేవనెత్తెఁగా నీ కలుషముఁ గడిగి వైచి నిన్ను విమలుఁ జేసెఁగా ||ఏల చింత||
నీకుఁ గల్గు వ్యాధు లన్నా నెవరు మీరఁ దీర్చెఁగా ప్రాకటముగ నీకు సకల పదవు లిచ్చి ప్రోచెఁగా ||ఏల చింత||
యేసు నిన్ను బాగు జేయ నిచట శ్రమలు బెట్టుగా వాసిగాను శ్రమలయందు యేసు పజ్జఁజేరుమా ||ఏల చింత||
నిన్ను తల్లడిల్లఁజేయు నీ విరోధు లందరిన్ మున్ను తండ్రి పగిదిఁ దరిమి పన్నుగాను బ్రోచెఁగా ||ఏల చింత||
సందియంబు లేల నీకు స్వర్గ నాధుఁ డుండఁగా అందమైన యీవులిచ్చి యతఁడు నిన్ను ఁ బ్రోవగా ||ఏల చింత||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.