TG-3661
Telugu

మహిమగల తండ్

Mahimagala Thandri

0
views
పల్లవి

మహిమగల తండ్రి – మంచి వ్యవసాయకుడు మహితోటలో నర మొక్కలు నాటించాడు (2) తన పుత్రుని రక్తనీరు – తడి కట్టి పెంచాడు తన పరిశుద్ధాత్మను – కాపుగా వుంచాడు (2) కాయవే తోటా – కమ్మని కాయలు పండవే చెట్టా – తియ్యని ఫలములు (2) ||మహిమ||

1వ చరణం

నీతి పూత జాతి కర్త – ఆత్మ సుతా ఫలములు నీ తండ్రి నిలువచేయు – నిత్య జీవ ఫలములు (2) అనంతమైన ఆత్మ బంధ – అమర సుధా కాంతులు (2) అనుకూల సమయమయ్యె – పూయు పరమ పూతలు (2) ||కాయవే||

2వ చరణం

అపవాది కంటబడి – కుంటుబడి పోకు కాపుకొచ్చి చేదు పండ్లు – గంపలుగా కాయకు (2) అదిగో గొడ్డలి వేరు – పదును పెట్టియున్నది (2) వెర్రిగా చుక్కలనంటి – ఎదిగి విర్రవీగకు (2) ||కాయవే||

3వ చరణం

కలువరి కొండలో పుట్టి – పారిన కరుణా నిధి కలుషమైన చీడ పీడ – కడిగిన ప్రేమానిధి (2) నిజముగాను నీవు – నీ సొత్తు కావు (2) యజమాని వస్తాడు – ఏమి ఫలములిస్తావు (2) ||కాయవే||

4వ చరణం

ముద్దుగా పెంచాడు – మొద్దుగా నుండకు మోదమెంతో ఉంచాడు – మోడుబారి పోకు (2) ముండ్ల పొదలలో కృంగి – మెత్తబడి పోకు (2) పండ్లు కోయ వచ్చువాడు – అగ్నివేసి పోతాడు (2) ||కాయవే||