TG-3498
Telugu

జయ జయ యేసు

Jaya Jaya Yesu

0
views
పల్లవి

జయ జయ యేసు – జయ యేసు జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2) జయ జయ రాజా – జయ రాజా (2) జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం ||జయ జయ||

1వ చరణం

మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు (2) పరమ బలమొసగు జయ యేసు (2) శరణము నీవే జయ యేసు ||జయ జయ||

2వ చరణం

సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తు (2) సమరము గెల్చిన జయ యేసు (2) అమరముర్తివి జయ యేసు ||జయ జయ||

3వ చరణం

సాతాన్ను గెల్చిన జయ యేసు – సాతాను ఓడెను జయ క్రీస్తు (2) పాతవి గతియించె జయ యేసు (2) దాతవు నీవే జయ యేసు ||జయ జయ||

4వ చరణం

బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ క్రీస్తు (2) బండలు తీయుము జయ యేసు (2) అండకు చేర్చుము జయ యేసు ||జయ జయ||

5వ చరణం

ముద్రను గెల్చిన జయ యేసు – ముద్రయు ఓడెను జయ క్రీస్తు (2) ముద్రలు తీయుము జయ యేసు (2) ముద్రించుము నను జయ యేసు ||జయ జయ||

6వ చరణం

కావలి గెల్చిన జయ యేసు – కావలి ఓడెను జయ క్రీస్తు (2) సేవలో బలము జయ యేసు (2) జీవము నీవే జయ యేసు ||జయ జయ||

7వ చరణం

దయ్యాలు గెల్చిన జయ యేసు – దయ్యాలు ఓడెను జయ క్రీస్తు (2) కయ్యము గెల్చిన జయ యేసు (2) అయ్యా నీవే జయ యేసు ||జయ జయ||