దేవుడే నా కాశ్రయంబు - దివ్యమైన దుర్గము= మహా
deevudee naa kaashrayanbu - divyamaina durgamu= mahaa
🎵 TG-1082🌐 Telugu
పల్లవి
దేవుడే నా కాశ్రయంబు - దివ్యమైన దుర్గము= మహా వినోదుడాపదల సహాయుడై నన్ బ్రోచును అభయ - మభయ - మభయ మెప్పు - డానంద – మానంద - మానంద మౌగ ||దేవుడే||
1వ చరణం
పర్వతములు కదలిన నీ - యుర్వి మారు పడినను = సర్వమును ఘోషించుచు నీ - సంద్రముప్పొంగినన్ - అభయ - మభయ - మభయ మెప్పు- డానంద ||దేవుడే||
2వ చరణం
దేవుడెపుడు తోడు కాగ - దేశము వర్దిల్లును = ఆ తావునందు ప్రజలు మిగుల - ధ న్యులై వసింతురు – అభయ - మభయ - మభయ మెప్పు - డానంద ||దేవుడే||
3వ చరణం
రాజ్యముల్ కంపించిన భూ- రాష్ట్రముల్ ఘోషించిన = పూజ్యుండౌ యెహోవా వైరి - బూని సంహరించును – అభయ - మభయ - మభయ మెప్పు - డానంద ||దేవుడే||