TG-1080
Telugu

దేవుడు మాపక్షమున ఉండగా మాకు విరోది ఎవడు

deevudu maapakssamuna undagaa maaku viroodi evadu

198
views
పల్లవి

దేవుడు మాపక్షమున ఉండగా మాకు విరోది ఎవడు జీవము గల దేవుని సైన్యముగా శాతానుని ఓడింతుము (2) యుద్ధం యెహోవాదే రక్షణా యెహోవాదే విజయం యెహోవాదే ఘనతా యెహోవాదే || దేవుడు ||

1వ చరణం

మా దేవునీ భాహువే తన ధక్షిణా హస్తమే ఆయన ముఖ కాంతియే మాకు జయమిచ్చును (2) తనదగు ప్రజగా మము రూపించి - నిరతము మాపై కృపచూపించి తన మహిమకై మము పంపించి - ప్రభావమును కనబరుచును || యుద్ధం||

2వ చరణం

మా దేవునీ ఎరిగినా జనులుగా మేమందరం భలముతో ఘన కార్యముల్‌ చేసి చూపింతుము (2) దేవుని చేసుర క్రియలు చేసి - భూమిని తల క్రిందులుగా చేసి ఆయన నామము పైకెత్తి - ప్రభు ద్వజము స్తాపింతుము ||యుద్ధం ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.