దేవుని సముఖ జీవ కవిలెలో - నీ పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా

deevuni samukha jeeva kavileloo - nee peerunnadaa...aa..aa neepeerunnadaa

🎵 TG-1076🌐 Telugu
పల్లవి

దేవుని సముఖ జీవ కవిలెలో - నీ పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా

1వ చరణం

జీవవాక్యము నిలలో చాటుచు - జీవితము లర్పించిరే హత సాక్షుల కవిలెలోన - నీ పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా ||దేవుని||

2వ చరణం

ఆకాశమండలములలో తిరిగెడు - అందకార శక్తులను గెలిచిన విజయవీరుల కవిలెలో - నీ పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా ||దేవుని||

3వ చరణం

పరిశుద్ధ యెరుషలేము సంఖ్య - పరిశుద్ధ గ్రంధము సూచించు సర్వోన్నతుని పురములలో - నీ పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా ||దేవుని|| దేవుని సముఖ జీవ కవిలెలో - నీ పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా ||దేవుని సముఖ||

4వ చరణం

దేవుని సన్నిధి మహిమ ధననిధి - దాతను వేడి వరము పొందిన ప్రార్ధన వీరుల కవిలెలో - నీ పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా ||దేవుని||

5వ చరణం

పరమునుండి ప్రభువు దిగగా - పరిశుద్ధులు పైకెగయునుగా పరిశుద్ధుల కవిలెలో - నీ పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా ||దేవుని||

Report Error