దేవుడు మనకు ఎల్లప్పుడు - తోడుగ నున్నాడు

deevudu manaku ellappudu - thooduga nunnaadu

🎵 TG-1079🌐 Telugu
పల్లవి

దేవుడు మనకు ఎల్లప్పుడు - తోడుగ నున్నాడు (2)

1వ చరణం

ఏదెనులో ఆదాముతోనుండెన్‌ -హానోకుతోడ నేగేను ధీర్గదర్శకులతో నుండెను - ధన్యులు దేవుని గలవారు ||తోడుగ||

2వ చరణం

దైవాజ్ఞను శిరసావాహించి - దివ్యముగ నబ్రాహము కన్న కుమరుని ఖండించుటకు - ఖడ్గమునెత్తిన యపుడు ||తోడుగ||

3వ చరణం

యేసేపు ద్వేషించబడి నపుడు - గోతిలో త్రోయ బడినపుడు శోధనలో చెరసాలయందు - సింహాసన మెక్కిన యపుడు ||తోడుగ||

4వ చరణం

ఫరోరాజు తరిమిన యపుడు - ఎర్రసముద్రపు తీరమున యోర్దాను నది దాటినపుడు - ఎరికో కూలినా యపుడు ||తోడుగ||

5వ చరణం

దావీదు సింహము నెదిరించినపుడు - దైర్యముగ, చీల్చీనపుడు గొల్యాతును హతమార్చినపుడు - సౌలుచే తరమ బడినపుడు ||తోడుగ||

6వ చరణం

సింహపు బోనులో దానియేలు - షడ్రకు,మేషకు, అబెద్నెగో అగ్ని గుండములో వేయబడెన్‌ - నల్గురుగా కనబడినపుడు ||తోడుగ' ||దేవుడు మనకు||

7వ చరణం

పౌలు బంధించబడినపుడు - పేతురు చెరలో నున్నపుడు అపొస్తులులు విశ్వాసులు - హింసించాబడిన యపుడు ||తోడుగ||

Report Error