TG-3500
Telugu

జయం జయం మన యేసుకే

Jayam Jayam Mana Yesuke

0
views
పల్లవి

జయం జయం మన యేసుకే మరణం గెలిచిన క్రీస్తుకే (2) స్తుతులర్పించెదము – స్తోత్రము చేసెదము (2) పునరుత్ధానుడైన క్రీస్తుని మహిమపరచెదము (2) ||జయం జయం||

1వ చరణం

పాపములేని యేసుడు సిలువలో పాపికై మరణించి (2) మూడవదినమున – తిరిగి లేచెను (2) మరణపు ముల్లును విరిచెను (2) ||జయం జయం||

2వ చరణం

పాపము చేసి మానవుడు కోల్పోయిన అధికారమును (2) సిలువను గెలిచి – తిరిగి తెచ్చెను (2) సాతాను బలమును గెలిచెను (2) ||జయం జయం||

3వ చరణం

పాపము విడిచి సోదరా ప్రభు సన్నిధికి రారమ్ము (2) పునరుత్ధాన శక్తితో నింపి (2) పరలోకమునకు చేర్చును (2) ||జయం జయం||