TG-4919
Telugu

చల్లా చల్లని వేళలో వెన్నెలా ఆ వెలుగులో

Challaa Challani Veellaloo Vennelaa Aa Veluguloo

0
views
పల్లవి

చల్లా చల్లని వేళలో వెన్నెలా ఆ వెలుగులో (2) నీతి సూర్యుడుదయించేగా బ్రతుకంతా ఓ పండుగా (2) బెత్లహేము పురములోని రక్షకుడుండే గొల్లలు జ్ఞానులొచ్చి ఘనపరచుండే ఆహా ఘనపరచుండే ఓహో ఘనపరచుండే ||బెత్లహేము||

1వ చరణం

మనలోని బాధలను తొలగించుటకు సంతోషం సమాధానం ఇచ్చుటకు (2) రారాజుగా భువికొచ్చేగా ఆ వెలుగునే మనకిచ్చేగా (2) రండి పూజించి ఘనపరిచి ఆరాధింతుము (2) ||బెత్లహేము||

2వ చరణం

ఆశలన్నీ దూరమైన మ బ్రతుకులో చిరునవ్వు నింపుటకు దిగివచ్చేగా (2) ఇమ్మానుయేలుగా జన్మించినే కన్నీరు నాట్యముగమార్చెనే (2) రండి పూజించి ఘనపరిచి ఆరాధింతుము (2) ||బెత్లహేము||