♪♫
TG-4833
Telugu
క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం
Kraisthava Jeevithan Saubhaagya Jeevithan
0
views
పల్లవి
క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం (2) కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి (2) ||క్రైస్తవ||
1వ చరణం
ఈ లోక ఘనత నన్ను విడిచినన్ లోకస్థులెల్లరు నన్ను విడిచినన్ (2) నా సహోదరులు నన్ను విడిచినన్ యోసేపు దేవుడే నా సహకారి (2) ||క్రైస్తవ||
2వ చరణం
నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు (2) భారం నాకెందుకు వ్యాకులమెందుకు ప్రభు ప్రజలతో నే కీర్తించెదన్ (2) ||క్రైస్తవ||
3వ చరణం
బూర శబ్దంబు మ్రోగెడి వేళ శ్రమ నొందిన నా ప్రభుని చూచెదన్ (2) ఏనాడు ఎప్పుడు నీవు వచ్చెదవు ఆనాటి వరకు నే కనిపెట్టెదన్ (2) ||క్రైస్తవ||